నోట్లోన వేలు పెడితే
చిత్రం: మేడ మీద అబ్బాయి (2017)
సంగీతం: షాన్ రహ్మాన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: వైకోమ్ విజయలక్ష్మి
నోట్లోన వేలు పెడితే
అస్సల్ కొరకనట్టు
గూట్లోన బెల్లం ముక్క
మింగేసి ఎరగనట్టు
ఫేస్ ని చూస్తే రాముడు
పనులు చూస్తే కృష్ణుడు
ఊరికొకడుంటే చాలు
ఈడి లాంటోడు
ఒళ్ళంతా ఎటకారం
బాబొయ్ ఎవడండి వీడు
కంట్లోన కారం కొట్టి
కర్చీఫ్ అందిస్తాడు
చేసేదేంటో చెప్పడు
చూసేదేంటో చెప్పడు
డాక్టర్ గారి చీటీ లాగా
అర్ధమవ్వడు
బిల్డ్ అప్ చూస్తె హై రేంజ్
వీడు తాబేలుకన్నా యమ లేజీ
వీడి వేషాలు అన్ని
వ్యాసాలు రాస్తే
అయ్యో సరిపోదొక్క పేజి
లైఫ్ అంటే వీడికి యమ ఈజీ
వీడికేం నేర్పగలదు కాలేజీ
అరె పాస్ అయితే ఏంటి
ఫెయిల్ అయితే ఏంటి
ఏమి పట్టించుకోడు క్రేజీ
చీమంత కష్టం కూడా
పడలేని బద్దకిష్టు
ఎట్టాగ ఎక్కగలడు
ఎత్తైన ఎవరెస్ట్
ఆలు లేదు చూలు లేదు
కొడుకు పేరు సోమలింగం
అన్నట్టుంది అయ్య బాబోయ్
వీడి వాలకం