December 30, 2019

ఏడు రంగుల హరివిల్లు ప్రేమా



ఏడు రంగుల హరివిల్లు ప్రేమా
ఆదివిష్ణు (2008)
శ్రీలేఖ
జీన్స్ శ్రీనివాస్, చిత్ర
చంద్రబోస్

ఏడు రంగుల హరివిల్లు ప్రేమా
ఏడు రంగుల హరివిల్లు ప్రేమా

ఏడు రంగుల హరివిల్లు ప్రేమా
ఏడు రంగుల హరివిల్లు ప్రేమా

తొలి చూపుతోనొ తొలి నవ్వుతోనొ
మొదలయ్యె ఆకర్షణే మొదటి రంగు
ఆ క్షణమునుండె అనుక్షణము ఉండె
రెండు గుండెల స్నేహమే 
రెండో రంగు రెండో రంగు

ఏడు రంగుల హరివిల్లు ప్రేమా
ఏడు రంగుల హరివిల్లు ప్రేమా
చెయ్యి తాకాలని చెంప నిమరాలనీ
చెయ్యి తాకాలని చెంప నిమరాలనీ
ముసిరే కోరికే మూడో రంగు
వదిలిపోలేడనీ బంధం వదులు కాలేదనీ
ఎదిగే నమ్మికె నాల్గొ రంగు నాల్గొ రంగు

ఏడు రంగుల హరివిల్లు ప్రేమా
ఏడు రంగుల హరివిల్లు ప్రేమా

ఓ ఎపుడు నవ్వులు చిందాలని
తన నవ్వులు నాకె చెందాలని
అనుకొను స్వార్ధమె ఐదో రంగు
కన్నుల నీరె రావొద్దని
కలలన్ని నీరై జారొద్దని
అల్లుకొను త్యాగమె ఆరొ రంగు
కన్నీరొచ్చే సమయంలోన
కన్నీరొచ్చే సమయంలోన
నవ్వుకునె పిచ్చితనమె ఏడో రంగు

ఏడు రంగుల హరివిల్లు ప్రేమ ప్రేమా
ఏడు రంగుల హరివిల్లు ప్రేమా
ఏడు రంగుల హరివిల్లు ప్రేమా
తన రంగులు మార్చని హరివిల్లు ప్రేమా

ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమా