అమర గాయకుడు "ఘంటసాల" వర్ధంతిసందర్భంగా, ఆయనకు
సమర్పిస్తున్న ఈ చిరు కానుక. జానకి గారు పాడారు. దేవ రాజు గారి రాసిన
ఈ పాట నాకు చాలా నచ్చినది మీరూ చదివి ఆనందిస్తారని కోరికతో....మీ ప్రసాద్
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
స్థిరమైనది మా మది లో మధురమైన నీ గానము
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
పదము లోని భావములు పదిలముగా మేళవించి
లాహిరి లో మమ్ములనూ కలవరింప చేసితివీ
కాదన లేనివీ మరువగ రానివీ
కాదన లేనివీ మరువగ రానివి
పాడిన నీ పాటలూ వినినంతనె తెలియునురా
వినినంతనె తెలియునురా
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
ప్రేమ గీతి పలికితే మేను పులక రించెను
ముద్దు మాట పలికితే హద్దు నీకు లేదనెను
సాహిత్యమె నీ ధ్వనిలో ఓలలాడెనూ
సాహిత్యమె నీ ధ్వనిలో ఓలలాడెనూ
హృదయం లో ఆనందము గుభాళించెనూ గుభాళించెనూ
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
వీణా శృతి మృదంగాలు పరవశించి పలికినవి
నాణ్యమైన నీ గానము నూతనమై వెలిగినది.
నీకు నీవే సాటిగా..ఆ
నీకు నీవే సాటిగ లోకమే మెచ్చినది..ఈ
సురలోకమంతా భువిలోనె తోచినది.
భువిలోనె తోచినది.
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా
స్థిరమైనది మా మది లో మధురమైన నీ గానము
భళిరా ఓ గాయకా ఘంటసాల నాయకా