December 30, 2019

అనుకుంటే కానిది ఏమున్నది

అనుకుంటే కానిది ఏమున్నది
ఔనన్నా కాదన్నా (2005)
కులశేఖర్
ఆర్పీ పట్నాయక్

అనుకుంటే కానిది ఏమున్నది
మనిషనుకుంటే కానిది ఏమున్నది
చలి చీమే ఆదర్శం
పని కాదా నీ దైవం
ఆయువే నీ ధనం
ఆశయం సాధనం
చేయరా సాహసం నీ జయం నిశ్చయం
చిలిపి బాలుడనుకుంటే చిటికెనేలు అనుకుంటే
కృష్ణుడెత్తలేడుగా గోవర్ధనభారం
సీత కానీ లేకుంటే చేతకాదు అనుకుంటే
విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం
మనసుంటే కనపడదా ఏదో మార్గం
కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం
ఓరిమే నీ బలం
లోకమే నీ వశం
చేయరా సాహసం....నీ జయం నిశ్చయం

రాయి లాగ కూర్చుంటే కాలు కదపలేనంటే
ఎప్పటికీ రాదుగా ఊహలకో రూపం
బతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే
భయపడక వెలిగించెయ్ నెత్తురుతో దీపం
ఏ చీకటి ఆపును రా రేపటి ఉదయం
ఏ ఓటమి ఆపును ర రాగల విజయం
కాలమే నీ పధం
కోరికే నీ రధం
చేయరా సాహసం....నీ జయం నిశ్చయం