December 30, 2019

పండిత నెహ్రూ పుట్టినరోజు


విచిత్ర దాంపత్యం (1971)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
గానం: సుశీల

పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికి పుట్టినరోజు
మమతా సమతా పుట్టినరోజు మంచికి కోవెల కట్టినరోజు

|| పండిత నెహ్రూ ||

ముత్యం లాంటి మోతీలాలుకు రత్నంలా జన్మించాడు
జాతిరత్నమై వెలిగీ యింకొక జాతి రత్నమును కన్నాడూ
అతడే జవహర్ లాలూ అతనికి మన జేజేలు
|| పండిత నెహ్రూ ||
తలపై తెల్లని టోపీ, ఎదపై ఎర్రగులాబీ
పెదవులపై చిరునవ్వు
మదిలో పున్నమి పువ్వు
చేతిలో పావురం మనజాతికి అతడే గోపురం

|| పండిత నెహ్రూ ||

మహాత్మాగాంధీ అడుగుజాడలో స్వరాజ్య సమరం నడిపాడు
రణదాహంతో రగిలే జగతిని శాంతి సుధలు కురిపించాడు
కన్నుమూసినా జవహర్ లాల్ కంటిపాపగా ఉన్నాడు
ఇంటింట జ్యోతిగ వున్నాడు చాచా నెహ్రూ అమర్ రహే
|| పండిత నెహ్రూ ||