December 30, 2019

రావే ప్రేమలతా..


రావే ప్రేమలతా..
పెళ్ళి సందడి (1959)
సంగీతం::ఘంటసాల వేంకటేశ్వరరావు
రచన::సముద్రాలరామానుజాచార్య(జూనియర్)
గానం::ఘంటసాల,రావు బాలసరస్వతి

ఆహా..చూపుల తీపితో
కొసరుచున్..దరిజేరీ
మనోజ్ఞ గీతికా..ఆ
లాపన సేయు..కూర్మి జవరాలొకవైపు
మరొక్కవైపునన్..ఈ పసికమ్మతెమ్మరెలు
ఈ పువుదోటల శోభాలున్నచో..ఓఓ
రేపటి ఆశ..నిన్న వెతలేతికి
నేటి సుఖాలతేలుమా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పల్లవి::

రావే ప్రేమలతా..ఆ..నీవే నా కవితా..ఆ
కిన్నెర మీటుల..కిలకిలవే
పలు వన్నెల..మెరుపుల మిలమిలవే

ఓహో కవిరాజా..ఆ..నేడే నెలరాజా..ఆ
ఎందులకోయీ..పరవశము
నీకెందులకో..ఈ కలవరము

చరణం::1

పూవులలో..నును తీవెలలో
ఏ తావున..నీవే వనరాణి
పూవులలో..నును తీవెలలో
ఏ తావున..నీవే వనరాణి

అందవతి..కనుపించినచో
కవులందరి..చందమిదేలే..ఏఏఏ
ఓహో కవిరాజా..ఆ..నేడే నెలరాజా..ఆ

చరణం::2

పరువులిడే..సెలయేరువలె
నిను చేరగ..కోరును నా మనసు
పరువులిడే..సెలయేరువలె
నిను చేరగ..కోరును నా మనసు
ఊహలతో..ఉలికించకుమా
నవమోహన..ఈ చెలి మదినే..ఏఏఏ
రావే ప్రేమలతా..ఆ..నీవే నా కవితా..ఆ

చరణం::3

ముచ్చటగా..మనముండినచో
మన మచ్చికకు..జగ మేమనునో
లోకముతో..మనకేమిపని
మనసేకమయి..మనముంటే

నేనే నీ కవితా..ఆ..ఆ..ఆ

రావే ప్రేమలతా..ఓహో..ఓహోహోఓఓఓ
ఓహో..ఓహోహోఓఓఓ..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్