December 30, 2019

గోపాల బాలుడమ్మా నా చందమామ


గోపాల బాలుడమ్మా నా చందమామ
చిత్రం: ఊయల (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

గోపాల బాలుడమ్మా నా చందమామ
పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా
రారా కన్నా కడుపార కన్నా
నా చిటికెలు వింటూ చూస్తావే 
నేనెవరో తెలుసా నాన్నా
నిను ఆడించే నీ అమ్మనురా 
నువు ఆడుకొనే నీ బొమ్మనురా
గోపాల బాలుడమ్మా నా చందమామ
పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా

గుండెమీద తాకుతుంటే నీ చిట్టి పాదం
అందె కట్టి ఆడుతుంది ఈ తల్లి ప్రాణం
ఉంగాలతోని సంగీతపాఠం 
నేర్పావ నాకు నీ లాలి కోసం
ఉగ్గు పట్టనా దిష్టి తగలని చుక్కపెట్టన
బోసి నవ్వుల బాషతో నువ్వు పిచ్చి తల్లికి
ఊసులు చెబుతూ పలకరిస్తావు...

గోపాల బాలుడమ్మా నా చందమామ
పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా

ఏ నోము ఫలమో పండి ఈ మోడు కొమ్మ
ఈ నాడు నిన్నే పొంది అయిందిర అమ్మా
ఇదే నాకు నేడు మరో కొత్త జన్మ
ప్రసాదించినాడు ఈ చిన్ని బ్రహ్మ
మూసి ఉంచిన లేత పిడికిలి ఏమి దాచెరా
నిన్ను పంపుతూ దేవుడు ఇచ్చిన
వరములన్నీ గుప్పిట ఉంచి అమ్మ కిచ్చావు...

గోపాల బాలుడమ్మా నా చందమామ
పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా
రారా కన్నా కడుపార కన్నా
నా చిటికెలు వింటూ చూస్తావే 
నేనెవరో తెలుసా నాన్నా
నిను ఆడించే నీ అమ్మనురా 
నువు ఆడుకొనే నీ బొమ్మనురా