భ్రమ అని తెలుసు
జగద్గురు ఆదిశంకర (2013)
రచన: జె. కె. భారవి,
గానం: శ్రీరామచంద్ర
సంగీతం: నాగ శ్రీవత్స
భ్రమ అని తెలుసు
బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు
కథ అని తెలుసు
కథలన్ని కంచికే చేరునని తెలుసు
తెలుసు తెర తొలుగుతుందని
తెలుసు తెల్లారుతుందని ...
తెలుసు
ఈ కట్టె పుట్టుక్కు మంటదని
తెలుసు
ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని ...
ఇన్ని తెలిసి ఇరకాటంలొ పడిపోతాముఎందుకని?
మాయ ... మాయ
వేదం తెలుసు ...
తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు
శాస్త్రం తెలుసు ...
శాశ్వతంగా ఉండేదెవ్వడీడలేడని తెలుసు ....
తెలుసు ఇది నీటి మూటని ...
తెలుసులే ఇది గాలి మేడని ...
తెలుసు ఈ బుడగ టప్పని పగిలిపోతదని ....
తెలుసు ఉట్టి పై ఉన్నదంతా ఉష్కాకియనీ ...
అన్నీ తెలిసి అడుసులొ పడి దొర్లుతుంటాము దేనికని
మాయ ... మాయా... మాయా
తేలిపోయింది ... తెలిసిపోయింది ...
తెలియనిదేదో ఉందని మనసా ...
తెలుసని ఎందరు చెబుతున్నా అది ... ఉందో లేదో తేలని హంసా ....
కళ్ళు రెండూ మూసెయ్యలంటా .... మూడో కంటిని తెరవాలంటా ...
మిన్ను మన్నూ మిట్టా పల్లం ఒక్కటిగా కనిపించాలంటా ...
ఆడే వాడు ఆడించే వాడు ఏకపాత్రలని ఎరగాలంటా ...
ఆ ఎరుక వచ్చి రాగానే
మాయం అయిపోతుందట మాయ