December 30, 2019

నీ చరణ కమలాల నీడయే చాలు


నీ చరణ కమలాల నీడయే చాలు
చిత్రం : శ్రీ కృష్ణావతారం (1967)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల, పి.లీల

నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు
నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు

నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవీ నందన వనాలు
నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవీ నందన వనాలు
నును మోవి చివురుపై
నను మురళిగా మలచి పలికించరా..ఆఆ..
పలికించరా మధువు లొలికించరా

మోవిపై కనరాని మురళిలో
వినలేని రాగాలు పలికింతునే

మోవిపై కనరాని మురళిలో
వినలేని రాగాలు పలికింతునే

మధురానురాగాలు చిలికింతునే

నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు
ఎందుకోయీ స్వామి నందనవనాలు

నీ హృదయ గగనాన నేనున్న చాలు
ఎందుకే ఓ దేవి బృందావనాలు

తులసీ దళాలలో తొలివలపులందించి

తులసీ దళాలలో తొలివలపులందించి
పూజింతునా...ఆఆ..ఆఆఅ...
పూజింతునా స్వామి పులకింతునా

పూజలను గ్రహియించి పులకింతలందించి

పూజలను గ్రహియించి పులకింతలందించి

లోలోన రవళింతునే

లోలోన రవళింతునే

ఓ దేవి నీలోన నివసింతునే

ఓ దేవి నీలోన నివసింతునే

నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు

నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవీ నందనవనాలు

నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు
ఎందుకోయీ స్వామి నందనవనాలు