December 30, 2019

పట్టి తెచ్చానులే



పట్టి తెచ్చానులే
చిత్రం: ఆత్మబంధువు (1985)
సంగీతం: ఇళయరాజా
రచన: రాజశ్రీ
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...
చరణం 1:

మనసున సెగ యెగసే ఏ మాయో.. 
వెలుపుల చలి కరిచే
వయసుకు అదివరసా 
వరసైన పిల్లదానికి అది తెలుసా

మాపటికి చలిమంటేస్తా.. 
కాచుకో కాస్తంతా
ఎందుకే నను ఎగదోస్తా.. 
అందుకే పడి చస్తా
చింతాకుల చీర గట్టి పూచింది పూదోట
కన్నే పువ్వు కన్ను కొడితే 
తుమ్మెదకూ దొంగాటా
దోబూచిలే నీ ఆటా...

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం
ఏది ఏది చూడనీవా దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవా దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...

చరణం 2:

పొద్దుంది ముద్దులివ్వనా 
ఇచ్చాక ముద్దులన్ని మూటగట్టనా
మూటలన్ని విప్పి చూడనా.. 
చూశాక నూటొకటి లెక్క చెప్పనా

నోటికి నూరైతేనే.. కోటికి కొరతేనా
కోటికి కోటైతేనే.. కోరికలే కొసరేనా
నోరున్నది మాటున్నది అడిగేస్తే ఏం తప్పు
రాత్రి అయింది రాజుకుంది చిటపటగా చిరు నిప్పు
అరె పోవే పిల్లా అంటా డూపు

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...