ఓహో గరళకంఠా
శ్రీ మంజునాథ (2001)
భువనచంద్ర
హంసలేఖ
అనురాధా శ్రీరామ్, బాలు
ఆఅ హ హ.. రుద్రా వీరభద్ర
కైలాసాన నీకు
సుభిక్షం సుభిక్షం
నిన్ను నమ్మిన భక్తులకి
దుర్భిక్షం దుర్భిక్షం దుర్భిక్షం
రుద్రా ఏయ్ వీరభద్రా
ఈ నమ్మనివాడి
చేతచిక్కితే
నిన్ను
చిత్తు చిత్తు
చిత్తు.. రుద్ర చిత్తు
చిత్తు చిత్తు..ఛిధ్ర
ఓహో గరళకంఠా
నీ మాటంటే ఒళ్ళు మంటా
కన్నోళ్ళే లేరంటా
ఎట్ట పుట్టావో చెప్పమంట
దొంగ శివ భంగ శివ
దుష్ట శివ భ్రష్ట శివ
హే ఈశ్వరా సర్వ లోకేశ్వరా
గంగాధరా గౌరీవరా
శ్రీ మంజునాథా నమో
ఓహో గరళకంఠా
నీ మాటంటే ఒళ్ళు మంటా
కన్నోళ్ళే లేరంటా
ఎట్ట పుట్టావో చెప్పమంట
ఓహో నుదుటే ఉన్నదంటా
ధగ ధగ మండే ఒక కన్ను
ఈడ మగువ బతుకౌతోంది మన్ను
హే
హే లయకారా
జననం మరణం నీకొక ఆట
లీలా డోలా! లోలా
ఓహో భూతనాథ నీ చేతా
ఎందుకంట ఇంత బారు తిరుశూలం
నిన్ను నమ్మినోడికి పోగాలం
హే
హే త్రిగుణేశా త్రికాల
కారకమే ఆ శూలం
చూస్తే ధన్యం ధన్యం
బిల్వపత్రమంటె మోజా నీకు
రుద్ర అందులోనె పెట్టి
ముంచుతాను రా రా రుద్ర
తిరుపమెట్టి తిరిగెటోడ
కాటి రుద్ర నీది
యోగం అసలు కానే కాదు
దొంగ నిద్ర
యోగేశ్వరా సర్వలోకేశ్వరా
సాకరుడా నిరాకారుడా
శ్రీ మంజునాథా నమో
ఓహో గరళకంఠా
నీ మాటంటే ఒళ్ళు మంటా
కన్నోళ్ళే లేరంటా
ఎట్ట పుట్టావో చెప్పమంట
సకలం స్వాహా చేస్తావు
గుఱ్ఱు కొట్టి కాట్లో
తొంగుతావు నువ్వు నిద్ర లేచేదేనాడు
హే చిద్రూపా
నువ్వే నిద్దుర లేచిన వేళా
అంతమే అనంతం
శవగణ భూతగణ
వాసనలతో కులికేటోడ
నీతో పార్వతెట్ట ఉంటదో
గంగ ఎంత మొత్తుకుంట తెర్లుతుంటదో హై
హే నీలకంఠా
హాలహలమును గ్రోలెదవయ్య
తీయగా అమృతం
శుచి రుచి ఉన్న చోట ఉండవంట
నీకు పచ్చి మద్య
మాంసాలంటే ఇష్టమంటా
గణ గణ గంట
కొడితే వస్తావంటా
ఇటు రా నిన్ను
విరిచి నంజుకుంటా
ఓహో గరళకంఠా
నీ మాటంటే ఒళ్ళు మంటా
కన్నోళ్ళే లేరంటా
ఎట్ట పుట్టావో చెప్పమంట
దొంగ శివ భంగ శివ
దుష్ట శివ భ్రష్ట శివ
హే ఈశ్వరా సర్వ లోకేశ్వరా
గంగాధరా గౌరీవరా
శ్రీ మంజునాథా నమో