December 30, 2019

ముద్దబంతులు..మువ్వమోతలు


ముద్దబంతులు
పండగ (1998)
సంగీతం::కీరవాణి
రచన::చంద్రబోస్
గానం::మనో.చిత్ర

పల్లవి::

ఆ..ముత్యాల ముగ్గుల్లో
ఆ..రతనాల గొబ్బిళ్లో
ముద్దబంతులు..మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు..పాడిపంటలు
వెండిముగ్గులు..పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు..ఆడపడుచులు

ముద్దబంతులు..మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు..పాడిపంటలు
వెండిముగ్గులు..పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు..ఆడపడుచులు
కలబోసి విరబూసే
మహదండిగా మదినిండగా
చలి పండుగే సంక్రాంతి

ముద్దబంతులు..మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు..పాడిపంటలు
వెండిముగ్గులు..పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు..ఆడపడుచులు

చరణం::1

అత్తింట సాగుతున్న
అల్లుళ్ల ఆగడాలు భోగి పళ్లుగా..ఆ
కంగారు రేపుతున్న
కోడళ్ల చూపులన్నీ భోగిమంటగా..ఆ
ఉన్నమాట పైకి చెప్పు
అక్కగారి వైనమేమో సన్నాయిగా
దేనికైన సిద్ధమైన బావగారి
పద్ధతేమో బసవన్నగా..ఆ
పిల్లపాపలే పచ్చతోరణాలుగా
పాలనవ్వులే పచ్చి పాయసాలుగా
కలబోసి తెరతీసి కనువిందుగా
మనకందిన సిరిసంపదే సంక్రాంతి

ముద్దబంతులు..మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు..పాడిపంటలు
వెండిముగ్గులు..పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు..ఆడపడుచులు

చరణం::2

మనసును చూసే కన్నులు ఉంటే
పగలే వెన్నెల రాదా..ఆ
మమతలు పూసే బంధాలుంటే
ఇల్లే కోవెల కాదా..ఆ
మన అనువాళ్లే నలుగురు ఉంటే
దినము కనుమే కాదా..ఆ
దేవతలేని దేవుడు నీవు..ఇల చేరావు
కనలేని కొనలేని..అనురాగమే నువు
పంచగా అరుదెంచదా..సుఖశాంతి

ముద్దబంతులు..మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు..పాడిపంటలు
వెండిముగ్గులు..పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు..ఆడపడుచులు

కలబోసి విరబూసే
మహదండిగా మదినిండగా
చలి పండుగే సంక్రాంతి

ముద్దబంతులు..మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు..పాడిపంటలు
వెండిముగ్గులు..పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు..ఆడపడుచులు