December 30, 2019

శీతాద్రి శిఖరాన



శీతాద్రి శిఖరాన
శ్రీ లలితా హారతి
గానం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ
రచన: బేతవోలు రామబ్రహ్మం
సంగీతం: టి. నాగరాజ్

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు |
మా తల్లి నత్తుకకు నీరాజనం _
కెంపైన నీరాజనం
భక్తి పెంపైన నీరాజనం

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మాతల్లి |
బాగైన అందెలకు నీరాజనం _
బంగారు నీరాజనం
భక్తి పొంగారు నీరాజనం
నెలకాల్పుడెందాల వలపు వీణలు మీటు
మాతల్లి గాజులకు నీరాజనం -
రాగాల నీరాజనం
భక్తి తాళాల నీరాజనం

మనుజాళి హృదయాల తిమిరాలు తొలగి0చు
మాతల్లి నవ్వులకు నీరాజనం -
ముత్యాల నీరాజనం
భక్తి నృత్యాల నీరాజనం

చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు
మా తల్లి ముంగెరకు నీరాజనం -
రతనాల నీరాజనం
భక్తి జతనాల నీరాజనం

పసి బిడ్డలను చేసి
ప్రజనెల్ల పాలించు
మాతల్లి చూపులకు నీరాజనం
అనురాగ నీరాజనం
భక్తి కనరాగ నీరాజనం

పగడాల మరపించు ఇనబింబ మనిపించు
మాతల్లి కుoకుమకు నీరాజనం -
నిండైన నీరాజనం 
భక్తి మెండైన నీరాజనం

ఏటి పిల్లల వోలె గాలి కల్లల నాడు
మాతల్లి కురులకు నీరాజనం _
నీలాల నీరాజనం
భక్తి భావాల నీరాజనం

జగదేక మోహిని సర్వేశు గేహిని
మా తల్లి రూపునకు నీరాజనం
నిలువెత్తు నీరాజనం
భక్తి నిలువెత్తు నీరాజనం

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు |
మా తల్లి నత్తుకకు నీరాజనం _
కెoపైన నీరాజనం
భక్తి పెంపైన నీరాజనం