December 30, 2019

మనసు కాస్త కలత పడితే


మనసు కాస్త
చిత్రం : శ్రీకారం (1996)
సంగీతం : ఇళయరాజా
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : కె.జె.ఏసుదాస్

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు
కనులనీరు తుడుచువారు
ఎవరులేరని చితి ఒడికి చేరకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి !!
నూరేళ్ళ నిండుగా జీవించమన్నది
వేటాడు వేళతో పోరడమన్నది !!
మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు

కలసిరాని కాలమెంత కాటేస్తున్నా
చలి చిదిమేస్తున్నా
కూలిపోదు వేరుఉన్న తరువేదైనా
తనువే మోడైనా
మాను జన్మకన్నా - మనిషి ఎంత మిన్న
ఊపిరిని పోసే ఆడదానివమ్మా
బేలవై నువ్వు కులితే నేలపై ప్రాణం ఉండడమ్మా

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి !!
నూరేళ్ళ నిండుగా జీవించమన్నది

ఆయువంతా ఆయుధముగా మార్చవే నేడు !
పరిమార్చవే కీడు !
కాళివైతే కాలి కింద అణుగును చూడు !
నిను అణిచేవాడు
మృత్యువు మించే హాని ఎక్కడుంది
ఎంత గాయమైన మాని తీరుతుంది
అందుకే పద ముందుకే
లోకమే రాదా నీ వెనకే

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు