December 31, 2019

నీ కళ్ళలోన కాటుక


నీ కళ్ళలోన కాటుక
జై లవ కుశ (2017)
చంద్రబోస్
దేవిశ్రీప్రసాద్
హేమచంద్ర

నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా
నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా
నీ మోము నింగినుండి ఓ ప్రేమ వాన రాగా
ఆ వానజల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా...ఆ ఆ ఆ ఆ
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా
ఓ ప్రేమవానలోన మునిగి పైకి పైకి తేలిపోయా
నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా
నా జంట నువ్వు చేరిక ఓ దారమల్లె రాగా
నీ నీలికురులనుండి ఓ పూలగాలి రాగా
నా ప్రేమ అన్న గాలిపటం చంద్రమండలాన్ని చేరగా ఆ ఆ ఆ ఆ...
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా
అసలు చందమామ నువ్వె అంటు నేలమీద వాలిపోయా

అసుర అసుర అసుర అసుర రావణాసురా
అసుర అసుర అసుర అసుర రావణాసురా

హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా
దగ దగ దగ దగా నీ సొగసులోని దగా
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా
నీ పెదవిలోని ఎరుపు నా పొగరుకి గాయం చేస్తే
అసుర అసుర అసుర అసుర రావణాసురా
మెడవంపులోని నునుపు గాయానికి కారం పూస్తే

దారుణంగా దగ్గరై ఉదృతంగా ఉప్పెనయ్
అందమైన ఔషదాన్ని తాగనా
హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా
హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా