December 31, 2019

బహుశా ఓ చంచలా..

బహుశా ఓ చంచలా..
వరుడు (2010)
మణిశర్మ
సోనూ నిగమ్, శ్రేయా గోషాల్

బహుశా ఓ చంచలా..ఆ.. ఎగిరే రాయంచలా...
తగిలే లేమంచు లా.. చూపులో.. చూపుగా..
ఐనా కావచ్చులే.. ఒకటై పోవచ్చులే..
ఇలపై ఆకాశమే ఇకపై వాలచ్చులే..
ఏదూరమైనా చేరువై...
బహుశా ఓ చంచలా..ఆ.. ఎగిరే రాయంచలా...
తగిలే లేమంచు లా.. చూపులో.. చూపుగా..

కనుపాపల్లో నిదురించీ.. కలదాటిందీ తొలిప్రేమా..
తొలిచూపుల్లో చిగురించీ.. మనసిమ్మందీ మన ప్రేమా.
కల గన్నానూ.. కవినైనానూ.. నిను చూసీ..
నిను చూశాకే నిజమైనాను తెర తీసీ..
బహుశా ఈ ఆమనీ.. పిలిచిందా రమ్మనీ..
ఒకటైతే కమ్మనీ.. పల్లవే పాటగా..
నాదిరిదిరిదిరిదిరిదిరి తోం దిరిదిరిదిరిదిరిదిరి
నాదిరిదిరిదిరిదిరిదిరి తోం దిరిదిరిదిరిదిరిదిరి
నాదిరిదిరిదిరిదిరిదిరి తోం దిరిదిరిదిరిదిరిదిరి
నాదిరిదిరితోందిరిదిరి నాదిరిదిరితోందిరిదిరినాదిరిదిరి
నాదిరిదిరితోందిరిదిరి నాదిరిదిరితోందిరిదిరినాదిరిదిరి
నాదిరిదిరితోందిరిదిరి నాదిరిదిరితోందిరిదిరినాదిరిదిరి
తననినన..

అలలై రేగే అనురాగం అడిగిందేమో ఒడిచాటు..
ఎపుడూ ఏదో అనుబంధం తెలిసిందేమో ఒకమాటు..
మధుమాసాలే మనకోసాలై ఇటురానీ..
మన ప్రాణాలే శతమానాలై జతకానీ..
తొలిగా చూశాను లే.. చెలిగా మారాను లే..
కలలే కన్నాను లే.. కలిసే ఉన్నాను లే..
నా నీవులోనే నేను గా .. ఆఅ..

బహుశా ఓ చంచలా..ఆ..
ఎగిరే రాయంచలా...
తగిలే లేమంచు లా..
చూపులో.. చూపుగా..