December 30, 2019

కళ్లకున్న కాటుక చూడు



కళ్లకున్న కాటుక చూడు
అదిరిందయ్యా చంద్రం (2005)
ఎం.ఎమ్. శ్రీలేఖ

కళ్లకున్న కాటుక చూడు
కట్టుకున్న చీరను చూడు
అస్తమాను నన్నే చూడయ్యో 
నా బంగారుకొండ
అంతదూరం వుంటే ఎట్టయ్యో

చెవులకున్న దిద్దులు చూశా
ముక్కుకున్న ముక్కెర  చూశా
చూడమన్నవన్నీ చూశానే నా పువ్వులదండా
చూపకుండ ఎన్నో దాచావే
జారుతున్న కొంగును చూడు
ఆపుతున్న సిగ్గుని చూడు
గుండెలోనే తొందరచూడు చూడు చూడు చూడయ్యా..

కళ్లకున్న కాటుక చూడు
కట్టుకున్న చీరను చూడు
అస్తమాను నన్నే చూడయ్యో నా బంగారుకొండ
అంతదూరం వుంటే ఎట్టయ్యో..
చూడయ్యో...
ఏందయ్యో...
......
నా ఒంటి మెరుపు బుగ్గల్లో నునుపు
తెల్లారూ చూడయ్యో
నీ చూపే తగిలేక పరువం ఆగదే

నీ కోలకళ్లు ఆ చీర గళ్లు ఈరోజే చూశానే
సుకుమారం చూస్తుంటే నిదురే రాదులే

ఒంపు సొంపు చూడాలి ఉయ్యాలల్లే ఊగాలి
నీ కన్నుల్లో నా రూపం నూరేళ్లైనా ఉండాలి
ఓ అత్తకొడకా కన్నెత్తి త్వరగా
అందాలు  చూశేయరా ముందుగా

కళ్లకున్న కాటుక చూడు
కట్టుకున్న చీరను చూడు
అస్తమాను నన్నే చూడయ్యో నా బంగారుకొండ
అంతదూరం వుంటే ఎట్టయ్యో
......
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! 
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం
శతం శతం శతం

నా సోకు చిరుకు కాసింత కొరుకు
తప్పేమి కాదయ్యో
సరసాల పలహారం ఇదిగో చూసుకో

నాజూకు సరుకు నచ్చేంతవరకు గిచ్చేసి పోతాలే
శింగారం చూస్తుంటే తనివే తీరదే
మళ్లీ మళ్లీ చూడాలి తుళ్లి తుళ్లి పోవాలి
నీ కౌగిట్లో కలకాలం నేనే వుండి పోవాలి
ఓ పెళ్లికొడకా మోహమాట పడకా
దాచింది చూశేయ్యరా ముందుగా

చెవులకున్న దిద్దులు చూశా
ముక్కుకున్న ముక్కెర చూశా
చూడమన్నవన్నీ చూశానే నా పువ్వులదండా
చూపకుండ ఎన్నో దాచావే

జారుతున్న కొంగును చూడు
ఆపుతున్న సిగ్గుని చూడు
గుండెలోనే తొందరచూడు చూడు చూడు చూడయ్యా..