December 30, 2019

నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే


నీటిలోన నింగిలోన నీవే
చిత్రం : వివాహబంధం(1964)
సంగీతం :ఎమ్.బి.శ్రీనివాసన్
సాహిత్యం : సినారె
గానం : భానుమతి, పి.బి.శ్రీనివాస్

నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే
కనులలోన కలలలోన కలసి ఉన్నాములే

అహ..హ హహ.. ఆ హాహ

నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే
కనులలోన కలలలోన కలసి ఉన్నాములే

మ్.హ్.హ్.అహ హ హహ ఆ హాహ

దూరతీరాలలో కోరికలు సాగెనో మ్.హ్.మ్.
నాలోని రాగాలతో కాలమే ఆగెను
నీవు నాకోసమే
నీడఓలే నీవెంట సాగే నేను నీకోసమే

మ్.హ్.హ్..అహ హ హహ ఆ హాహ
నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే
కనులలోన కలలలోన కలసి ఉన్నాములే

అహ హ హహ ఆ హాహ

నావ ఊగాడెను భావనలు పాడెనుమ్.హ్.మ్.
నావ ఊగాడెను భావనలు పాడెనుమ్.హ్.మ్.
ఈనాడు నా మేనిలో వీణలే మ్రోగెనుఎంత ఆనందమే
నేటికైన ఏనాటికైనా నిలుచు ఈ బంధము

మ్.హుహు..అహ హ హహ ఆ హాహ

నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే
కనులలోన కలలలోన కలసి ఉన్నాములే

అహ హ హహ ఆ హాహ
అహ హ హహ ఆ హాహ
అహ హ హహ ఆ హాహ