December 30, 2019

చిన్నారి స్నేహమా..చిరునామా తీసుకో


చిన్నారి స్నేహమా..
చిన్నారి స్నేహం (1989)
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::బాలు,శైలజ,సుశీల,రమేష్.

పల్లవి::

లాలలలా లాలలలా లా
లాలలలా లాలలలా లా

చిన్నారి స్నేహమా..చిరునామా తీసుకో
గతమైన జీవితం..కథ గానె రాసుకో
మనసైతె మళ్ళీ..చదువుకో..ఓఓఓఓఓ
మరు జన్మ కైన కలుసుకో..ఓఓఓఓఓ
ఏనాటి కేమవుతున్నా..ఏ గూడు నీదవుతున్న
హాయి గానే సాగిపో..ఓఓ

చిన్నారి స్నేహమా..చిరునామా తీసుకో
గతమైన జీవితం..కథ గానే రాసుకో
చరణం::1

జీవితం నీకోసం..స్వాగతం పలికింది
ఆశలే వెలిగించి..హారతులు ఇస్తుంది
ఆకాశమంత ఆలయం..నీకోసం కట్టుకుంది
కళ్యాణ తోరణాలుగా..నీ బ్రతుకే మార్చుతుంది
స్నేహం పెంచుకుంటుంది..ప్రేమే పంచమంటుంది
కాలం కరిగిపొతుంటే..కలగా చెదిరి పోతుంది
మాసిపోని గాయమల్లె..గుండె లోనె ఉంటుంది

చిన్నారి స్నేహమా..చిరునామా తీసుకో
గతమైన జీవితం..కథ గానే రాసుకో

చరణం::2

లా లలల లా లలల లా లలల లలలలా
లా లలల లా లలల లా లలల లలలలా

ఆశయం కావాలి..
ఆశలే తీరాలి
మనిషిలో దేవుణ్ణి..మనసుతో గెలవాలి

అందాల జీవితానికో..అనుబంధం చూసుకో
అనురాగమైన లోకమే..నీ సొంతం చేసుకో

లోకం చీకటవుతున్నా..బ్రతుకే భారమవుతున్నా
మనసే జ్యోతి కావాలి..మనిషే వెలుగు చూపాలి
మరో ప్రపంచ మానవుడిగా..ముందు దారి చూడాలి

చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కథ గానె రాసుకో
మనసైతే మళ్ళి చదువుకో..ఓఓఓఓ
మరు జన్మ కైనా కలుసుకో..ఓఓఓఓ
ఏనాటి కేమవుతున్నా
ఏ గూడు నీదవుతున్న
హాయి గానే...ఆడుకో
చిన్నారి స్నేహమా..చిరునామా తీసుకో
గతమైన జీవితం..కథ గానే రాసుకో