December 31, 2019

గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా


గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా
చిత్రం: క్లాస్ మేట్స్ (2007)
సంగీతం: కోటి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: హేమచంద్ర

పల్లవి:

గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ.. 
నిన్ను కలుసుకోనీ

గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ... 
నిన్ను కలుసుకోనీ
నిన్ను కలుసుకోనీ... విన్నవించుకోనీ... 
ఇన్నాళ్ళ ఊసులన్నీ
చరణం 1:

నీలిమబ్బులో నిలిచిపోకలా..ఆ ఆ ...
నీలిమబ్బులో నిలిచిపోకలా నింగి రాగమాలా
నీలి ముసుగులో మెరుపుతీగల దాగి ఉండనేలా

కొమ్మకొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు వాలగా
కొమ్మకొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు వాలగా
ఆ ఇలకు రమ్మని చినుకు చెమ్మని చెలిమి కోరుకోనీ... 
నిన్ను కలుసుకోనీ

గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ... 
నిన్ను కలుసుకోనీ
నిన్ను కలుసుకోనీ... విన్నవించుకోనీ... 
ఇన్నాళ్ల ఊసులన్నీ

చరణం 2:

రేయి దాటని రాణివాసమా.. ఆ ఆ ...
రేయి దాటని రాణివాసమా 
అందరాని తారా
నన్ను చేరగా దారి చూపనా 
రెండు చేతులారా

చెదిరిపోని చిరునవ్వుగా 
నా పెదవిపైన చిందాడగా
చెదిరిపోని చిరునవ్వుగా 
నా పెదవిపైన చిందాడగా
తరలిరమ్మని తళుకులిమ్మని తలపు తెలుపుకోనీ... 
నిన్ను కలుసుకోనీ

గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ... 
నిన్ను కలుసుకోనీ
నిన్ను కలుసుకోనీ... విన్నవించుకోనీ... 
ఇన్నాళ్ల ఊసులన్నీ