December 30, 2019

రాయబారం పంపిందెవరే


రాయబారం పంపిందెవరే
చిత్రం: ప్రియరాగాలు (1997)
సంగీతం: మరకతమణి కీరవాణి
సాహిత్యం: చేంబోలు “సిరివెన్నెల” సీతారామశాస్త్రి
నేపథ్య గానం: చిత్ర, బాలు

పల్లవి: 

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో
ప్రేమజంటను కలిపిందెవరే పూలతోటల్లో
కోకిలమ్మను కూయమంటూ 
పల్లెవీణను మీటమంటూ
కళ్యాణిరాగాల వర్ణాలలో
చరణం 1: 

నీ పాట తేట తేట తెలుగు పాట
చల్లనమ్మ చద్దిమూట
అన్నమయ్య కీర్తనల ఆనందకేళిలా
నీ బాట గడుసుపిల్ల జారుపైట
గండుమల్లెపూలతోట
పల్లెటూరి బృందావనాల సారంగలీలగా
చిరుమబ్బుల దుప్పటిలో ముసుగెట్టిన జాబిలిలా
నునువెచ్చని కోరికనే మనువాడిన చల్లని వెన్నెలలా
కోడికూసేవేళదాకా వుండిపోతే మేలు అంటూ
గారాలబేరాలు కానిమ్మంటూ

చరణం 2: 

ఉయ్యాల ఊపిచూడు సందెవేళ
పిల్లగాలి శోభనాల
కొండనుంచి కోనవొడికి జారేటి వాగులా
జంపాల జామురాతిరైనవేళ
జాజిపూలజవ్వనాల
జంటకోరి జాణపాడే జావళీపాటలా
గోపెమ్మలు కలలుకనే గోవిందుని అందములా
రేపల్లెకు వూపిరిగా రవళించిన వేణువుచందంలా
హాయిరాగం తీయమంటూ మాయచేసి వెళ్ళమంటూ
నాదాల తానాలు కానిమ్మంటూ