December 31, 2019

పైట కొంగు ఎంతో మంచిది


పైట కొంగు ఎంతో మంచిది
పెళ్ళి (1997)
సిరివెన్నెల
బాలు, చిత్ర
ఎస్.ఏ. రాజ్ కుమార్

పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది

పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది

జోడుకట్టిచూడు నిన్ను ఏడిపించదింక ఈడు

నచ్చచెప్పి చూడు కాస్త రెచ్చగొట్టి జతకూడు

కాసుకో అమ్మడూ..... కొంటె దూకుడు                     
చరణం 1: 

సొగసులు ఇమ్మని నిను బతిమాలనీ 
  
తెగబడి రమ్మనీ పిలవకు వయసునీ 

అదిరిపడే పెదవులలో అనుమతి నే చదవనీ

బిడియపడే మనసుకదా అడుగకు పైపదమని

బెదురు ఎంతసేపని ఎవరున్నారని

అదునుచూసి గమ్మునే అందాలయ్యా అందాన్నీ...
                                  
.
చరణం 2: 

చలిచలి గాలిలో చెమటలు ఏంటట...?

వలపులలీలలో అది ఒక ముచ్చట

ఎదురుపడే మదనుడితో వరస ఎలా కలుపుట

తెరలు విడే తరుణములో తెలియనిదేముందట

మాయదారి ప్రేమలో ఏంచెయ్యాలంట

మోయలేని హాయిలో ఒళ్ళోకొస్తే చాలంట