ప్రేమించే ప్రేమవా
నువ్వు-నేను-ప్రేమ (2006)
వేటూరి
రెహమాన్
శ్రేయ గోషాల్, నరేశ్ అయ్యర్
ప్రేమించే ప్రేమవా...ఊరించే ఊహ వా...
ప్రేమించే ప్రేమవా... పూవల్లె పుష్పించే...
నే నేనా అడిగా నన్ను నేనే... నే నీవే హృదయం అన్నదే ...
ప్రేమించే నా ప్రేమవా...ఊరించే ఊహ వా...
ప్రేమించే ప్రేమవా... పూవల్లె పుష్పించే...
పువ్వైనా పూస్తున్న నీ పరువంగానే పుడతా...
మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురై..
నీవే నా మదిలో ఆడ, నేనే నీ నటనై రాగా ...
నా నాడుల నీ రక్తం, నడక లో నీ శబ్దం ఉందే హో ...
తోడే దొరకని నాడు విల విల లాడే ఒంటరినీ...
ప్రేమించే ప్రేమవా...ఊరించే ఊహ వా...
నే నేనా అడిగా నన్ను నేనే...
నే నేనా అడిగా నన్ను నేనే...
ప్రేమించే నా ప్రేమవా...ఊరించే ఊహ వా...
నెలనెల వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా...
నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా ..
తుమ్మెద తేనెలు తేలే ... నీ మదిలో చోటిస్తావా ...
నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించ తరమా...
నీరే సంద్రం చేరే గలగల పారే నది తెలుసా...
ప్రేమించే ప్రేమవా...ఊరించే ఊహ వా...
ప్రేమించే ప్రేమవా... పూవల్లె పుష్పించే...
నేనేనా అడిగా నన్ను నేనే... నే నీవే హృదయం అన్నదే ...
ప్రేమించే ప్రేమవా...ఊరించే ఊహ వా...
ప్రేమించే నా ప్రేమవా...ఊరించే ఊహ వా...
ప్రేమించే ప్రేమవా... పూవల్లె పుష్పించే...