December 23, 2019

నాలోని రాగమీవే


నాలోని రాగమీవే
చిత్రం:  పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం:  ఘంటసాల
గీతరచయిత:  సినారె
నేపధ్య గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:

    ఓ..ఓ..ఓ..ఓ..

    నాలోని రాగమీవే.. నడయాడు తీగవీవే
    పవళించెలోన బంగారు వీణ.. పలికించ నీవు రావే

    నెల రాజువైన నీవే.. చెలికాడవైన నీవే
    చిరు నవ్వులోన తొలి చూపులోన.. కరగించి వేసినావే

    నెలరాజువైన నీవే..

చరణం 1:

    నీ నీడ సోకగానే.. నీ మేను తాకగానే
    ఊఁ.. అహా..
    ఆఆఆ.. ఒహో..
    ఆఆఆ.. ఊఁహూఁ..

    నీ నీడ సోకగానే.. నీ మేను తాకగానే
    మరులేవో వీచే మనసేమో పూచే.. విరివానలోన కురిసేనే

    నెల రాజువైనా నీవే... చెలికాడవైన నీవే
    చిరునవ్వులోన తొలిచూపులోన.. కరగించి వేసినావే
    నెల రాజువైన నీవే..

చరణం 2:

    నీ చేయి విడువలేను.. ఈ హాయి మరువ లేను
    ఆఆఆ.. అహా..
    ఆఆఆ.. ఒహో..
    ఆఆఆ.. ఊఁహూఁ..

    నీ చేయి విడువలేను.. ఈ హాయి మరువ లేను
    కనరాని వింత ఈ పులకరింత.. నను నిలువనియ్యదేమోయి

    నాలోని రాగమీవే.. నడయాడు తీగవీవే
    పవళించెలోన బంగారు వీణ.. పలికించ నీవు రావే

    ఆహాహహాహహాహ.. ఓహోహొహోహొహోహొ..