December 23, 2019

మనసున మనసుగ


మనసున మనసుగ
లవ్ బర్డ్స్ (1996)
రెహమాన్
రాజశ్రీ
హరిహరన్, చిత్ర

మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా

మేఘం నేల ఒళ్ళు మీటే రాగమల్లే ప్రేమా వరాలజల్లు కావా
పిలుపే అందుకోని బదులే తెలుపుకోను కౌగిట ఒదిగి ఉండనీవా
నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగునా
మల్లెపూల మాలై నిన్నే వరించి పూజించే వేళ
నిరుక్షించు స్నేహం కోరి జతనై రానా రానా
ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా
నా శ్వాస ప్రతిపూట వినిపించు నీ పాట
ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట
మనసున మనసుగ నిలిచినా కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా

పువ్వై నవ్వులని తేనై మాధురిని పంచే పాట మన ప్రేమా
విరిసే చంద్రకళ ఎగసే కడలి అల పలికే కవిత మన ప్రేమా
కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై
వేటాడు ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై
నూరేళ్ళ కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై
నువ్వు నేను చెరి సగమవుదాం వయస్సు పండించే వరమై
ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం
తుదే లేని ఆనందం వేచేనే నీ కోసం
మనసున మనసుగ నిలిచినా కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా.........