December 22, 2019

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
పాడిన వారు టంగుటూరి సూర్యకుమారి

అదే పాటని
అల్లుడొచ్చాడు (1976) అనే చిత్రంలో వాడుకున్నారు


సంగీతం : శంకరంబాడి సుందరాచారి
సాహిత్యం : శంకరంబాడి సుందరాచారి
గానం : సుశీల

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులూ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులూ

కడుపులో బంగారు కనుచూపులో కరుణా
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి

మా తెలుగు తల్లికి మల్లె పూదండా

గల గలా గోదారి కదలి పోతుంటేను ॥గల గలా॥
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

మా తెలుగు తల్లికి మల్లె పూదండా

అమరావతీ గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

మా తెలుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ పాటలే పాడుతాం
నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!!