నమో జనని భారతావనీ సకలసౌఖ్య సంధాయినీ
గిరులందున తరులందున వనులందున గనులందున
కోటి కోటి కంఠాలలో నీ కీర్తియె ప్రతిధ్వనించు ఈ జగమే పరవశించు
ధర్మరథుల కర్మయుతుల గిరికానన పురవాసుల
విజ్ఞానుల అజ్ఞానులలో నీ రూపమే మాకు దోచు ఏకాత్మత ఎదలబూచు
శాస్త్రజ్ఞుల శోధనలో ధర్మజ్ఞుల బోధనలో
వీరవ్రతుల వరసాధనలో నీ దీక్షయె వెల్లివిరియు నీ దక్షత జల్లు కురియు
యువజనముల కవిగణముల యోధవరుల యోగిమణుల
కార్మిక కర్షకజనాలలో నీ శక్తియె పొంగి పొరలు నీ ప్రతిభయె దిశలమెరయు