ఓ నా రాజా.. రావా రావా..
చిత్రం: ఆమె ఎవరు? (1966)
రచన: దాశరథి
సంగీతం: వేద
గానం: సుశీల
పల్లవి:
ఓ నా రాజా.. రావా రావా..
చెలి నే మరిచేవా?
ఓ నా రాజా.. రాజారావా.. రావా..
చరణం 1:
నీరూపే ఆశ రేపేను
నీమాటే వీణ మీటేనూ.. ఓ...
గతాలే నన్ను పిలిచాయి..
ఆ హాయి నేడు లేదోయీ
కలగా కరిగిందంతా
జగమే ఎంతో వింత
రేయీ-పగలూ నిన్నే వెదికేనోచరణం 2:
వృధాగా కాలమేగేను
నిరాశే పొంగివొచ్చేను .. ఓ...
తరంగంలాగా రావోయీ
ప్రియా నన్నాదుకోవోయి
ఏదో తీరని బాధ
కన్నీరొలికే గాధ
రేయీ-పగలూ నిన్నే వెదికేనో
చరణం 3:
నీకోసం నేనే వచ్చాను
నీ ఇంటికి దీపమైనాను
నాతోనే ఆడుకోవేలా
ఈ కోపం నేడు నీకేలా
నీ అడుగులలో నేనూ
నాకన్నులలో నీవు
నాలో నీవు నీలో నేనేలే
(విషాద గొంతులో) చరణం 4:
వరించిన మంచి వధువునులే
స్పృశించే తీపి మధువునులే
ప్రియా నీ ప్రేమ కథనోయి
సదా నీ నీలి నీడనులే
ఏనాటిదో అనుబంధం
ఎన్నడు చెడదీ బంధం
రేయీ-పగలూ నిన్నే వెదికేనో