December 26, 2019

అందాల ఈ రేయి



అందాల ఈ రేయి
చిత్రం: ఆమె ఎవరు? (1966)
రచన: దాశరధి
సంగీతం: వేద
గానం: సుశీల

పల్లవి:

అందాల ఈ రేయి
పలుమారు రాదోయ్
జాగు చేయకో....య్
నయనాలు పిలిచేను
అధరాలు వెతికేను
జాలి చూపవో....య్ (2)

అందాల ఈ రేయి
ఆ...ఆ...ఆ...
చరణం 1:

ఈ లోకమే పులకించగా
నా వైపు చూడవా
ఈ జీవితం వికసించగా
నాతోటి ఆడవోయ్
ఆనందమే వెదజల్లిన ఈరోజు నీదిలే
నీ రూపు గా...ని చూపుగానీ రేపు లేదులే
అందాల ఈ రేయి
ఆ...ఆ...ఆ...

చరణం 2:

ఓ జాబిలీ నీ కౌగిలి
చెలి నేడు కోరెను
గతజన్మలో తన జీవితం
కలవోలె నూగెను
మరుజన్మలో నీ దానిగ జీవించనెంచెను
కలలు ఫలించి కలతే తీర
చెంతచేరవో....య్

అందాల ఈ రేయి
పలుమారు రాదో....య్
జాగు చేయకో....య్
నయనాలు పిలిచేను
అధరాలు వెతికేను
జాలి చూపవో....య్

అందాల ఈ రేయి
ఆ...ఆ...ఆ...