December 23, 2019

ఎక్కడో దూరాన కూర్చున్నావు


ఎక్కడో దూరాన కూర్చున్నావు
చిత్రం: దేవుడమ్మ (1973)
సంగీతం: సత్యం
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: బాలు

పల్లవి :

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ............
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ............

ఎక్కడో దూరాన కూర్చున్నావు..
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు..
తమాష చూస్తున్నావు … సామీ …
ఎక్కడో దూరాన కూర్చున్నావు..
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు..
తమాష చూస్తున్నావు..సామీ
ఎక్కడో దూరాన కూర్చున్నావు..ఉ....

చరణం : 1

లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు..
మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు..
మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా సొంతమని అనిపిస్తావు ..
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా..
హ హ హ..చేసేస్తావు.. సామీ

ఎక్కడో దూరాన కూర్చున్నావు..
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు..
తమాష చూస్తున్నావు … సామీ …
ఎక్కడో దూరాన కూర్చున్నావు

చరణం : 2

పెరుగుతుంది వయసనీ అనుకుంటాము..
కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము
పెరుగుతుంది వయసనీ అనుకుంటాము..
కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము
కళ్ళు తెరిచి నిజమేదో తెలిసే లోగా
మా కళ్ళముందు మాయతెరలు..కప్పేస్తావు … సామీ

ఎక్కడో దూరాన కూర్చున్నావు..
ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఎక్కడో దూరాన కూర్చున్నావు..
సామీ..ఎక్కడో దూరాన కూర్చున్నావు