December 23, 2019

లేత కొబ్బరి నీళ్ళల్లే



లేత కొబ్బరి నీళ్ళల్లే
చిత్రం :  అల్లుడొచ్చాడు (1976)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు

పల్లవి :

లేత కొబ్బరి నీళ్ళల్లే... 
పూత మామిడి పిందల్లే..
లేత కొబ్బరి నీళ్ళల్లే ..
పూత మామిడి పిందల్లే..
చెప్పకుండా వస్తుంది చిలిపి వయసు..
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు.. మనసూ...

చరణం 1 :

పొంగువస్తుంది నీ బాల అంగాలకు .. ఏహే...
రంగు తెస్తుంది నీ పాల చెక్కిళ్ళకు...

కోక కడతావు మొలకెత్తు అందాలకు.. ఏహే...
కొంగు చాటేసి గుట్టంత దాచేందుకు...
దాగలేనివి.. ఆగలేనివి...
దారులేవో వెతుకుతుంటవి...

చరణం 2 :

కోటి అర్ధాలు చూసేవు నా మాటలో..ఓ...
కోర్కెలేవేవో రేగేను నీ గుండెలో...
నేర్చుకుంటాయి నీ కళ్ళు దొంగాటలు..
ఆడుకుంటాయి నాతోటి దోబూచులు..

చూచుకొమ్మని.. దోచుకొమ్మని...
చూచుకొమ్మని దోచుకొమ్మని... 
దాచుకున్నవి పిలుస్తుంటవి...

చరణం 3 :

ఓ...వయసు తెస్తుంది ఎన్నెన్నో పేచీలను..ఏహే...
మనసు తానొల్లనంటుంది రాజీలను...

ఆహా...పగలు సెగబెట్టి వెడుతుంది లోలోపల...ఓహో
రాత్రి ఎగదోస్తు ఉంటుంది తెల్లారులు...
రేపు ఉందని... తీపి ఉందని.. 
ఆశలన్నీ మేలుకుంటవి...