December 22, 2019

నే తొలిసారిగ కలగన్నది నిన్నే కదా...

నే తొలిసారిగ
సంతోషం (2002)
సిరివెన్నెల
ఉష
ఆర్.పి.పట్నాయక్

నే తొలిసారిగ
కలగన్నది నిన్నే కదా...
నా కళ్ళెదురుగ
నిలుచున్నది నువ్వే కదా...
స్వప్నమా నువ్వు సత్యమో
తేల్చి చెప్పవే ప్రియతమా
మౌనమో మధుర గానమో
తనది అడగవే హృదయమా
ఇంతలో చేరువై
అంతలో దూరమై
అందవా స్నేహమా

రెక్కలు తొడిగిన తలపు నువ్వే
కాదా నేస్తమా
ఎక్కడ వాలను చెప్పు నువ్వే
సావాసమా
హద్దులు చెరిపిన చెలిమినువై
నడిపే దీపమా
వద్దకు రాకని
ఆపకిలా అనురాగమా
నడకలు నేర్పిన ఆశవు కద
తడబడనీయకు కదిలిన కథ
వెతికే మనసుకు
మమతే పంచుమా

ప్రేమా నీతో పరిచయమే
ఏదో పాపమా
అమృతమనుకొని నమ్మడమే
ఒక శాపమా
నీ ఓడి చేరిన ప్రతి మదికి
బాధే ఫలితమా
తీయని రుచిగల కటికవిషం
నువ్వే సుమా
పెదవులపై చిరునవ్వుల దగ
కనబడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా

నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా
పంతమా బంధమా

నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా