December 22, 2019

రాయ రాయె రాయ రాయె మైసమ్మ,

రాయ రాయె రాయ రాయె మైసమ్మ,
ఇస్మార్ట్ శంకర్ (2019)
మణిశర్మ
కాసర్ల శ్యామ్
రాహుల్ సిప్లిగంజ్, మోహన

నీ ముక్కుపోగు మెరుపులోన..
పొద్దుపొడిసె తూరుపులోన మైసమ్మా
ఎర్రా ఎర్రని సూరీడే..
నీ నుదుటున బొట్టయ్యే
ఓ సల్లనిసూపుల తల్లి మాయమ్మా

అమ్మలగన్న అమ్మరన్నా..
పచ్చి పసుపు బొమ్మరన్నా
యాపచెట్టు కొమ్మరన్నా..
ధూపమేసే దుమ్మురన్నా
ఆషాఢ మాసమన్నా..
అందులో ఆదివారమన్నా
కొత్త కుండల బోనమన్నా..
నెత్తికెత్తెను పట్నమన్నా
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండి మైసమ్మరో
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండి మైసమ్మరో

హే రాయ రాయె రాయ రాయె మైసమ్మ,
బల్కంపేటెల్లమ్మవే,
మా తల్లి బంగారు మైసమ్మవే
ఉజ్జయినీ మాంకాళివే..
మాయమ్మ ఊరూరా పోచమ్మవే
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండి మైసమ్మరో

రేవుల పుట్టింది.. రేణుక ఎల్లమ్మ
జెర్రిపోతుల తీసి జడల చుట్టింది
నాగుపాముల తీసి నడుముల కట్టింది
ఏడుగురు అక్కచెల్లెళ్లు ఎంటరాంగ
ఏడేడు లోకాలు ఏలుతున్నదమ్మ
మావురాల ఎల్లమ్మ దండాలు తల్లీ

దిస్ ఈజ్..బర్కత్ పుర
డీజే ఇస్మార్ట్..డిస్కో బోనాల్

పెయ్యి నిండ గవ్వల్ని పేసుకున్నవే
వెయ్యికళ్ళా తల్లీ నీకు యాటపోతులే
నిమ్మకాయ దండల్లో నిండుగున్నవే
కల్లూ కుండ తెచ్చి ఇక సాక పోస్తమే

అరె..
చింతా పూల చీరకట్టినవే
చేత శూలం, కత్తి పట్టినవే
మొత్తం దునియానే ఏలుతన్నావే
రాయ రాయె రాయ రాయె మైసమ్మ,

జూబ్లీహిల్సు పెద్దమ్మవే..
మాయమ్మ జగమేలే మా తల్లివే
గోల్కొండ ఎల్లమ్మవే..
మాయమ్మ లష్కరుకే నువ్ రాణివే
హోసే... హోసే.. పోతరాజురో..
జజ్జనకర జజ్జనకర తీనుమారురో
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండిమైసమ్మరో

ఏస్కో మామా తీన్మార్...

అగ్గి గుండాలల్లో నువ్వు భగ్గుమన్నవే
సుట్టూ ముట్టు సుక్కల్లొ ముద్దుగున్నవే
పుట్టలోనా ఉన్నట్టి మట్టిరూపమే..
బాయిలోన పుట్టి అల్లినావు బంధమే
గాలీ దూళీ.. అంతా నువ్వేలే
జాలీ గల్లా తల్లీ నువ్వేలే
ఈ జనమంతా నీ బిడ్డలే
రాయ రాయె రాయ రాయె మైసమ్మ,

బెజవాడ దుర్గమ్మవే..
మాతల్లి కలకత్తా మాంకాళివే
కంచిలోన కామాక్షివే..
మాయమ్మ మధురలోన మీనాక్షివే
యోసే.. యోసే..అరే ఈల గోలరో..
తొట్టేళ్లతో పొట్టేళ్ల బండి కదిలెరో
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండి మైసమ్మరో
దిస్ ఈజ్ హమారా కిర్రాక్
బోనాల్ బోనాల్