స సరాగాలాడాలి


స సరాగాలాడాలి
చిత్రం : రావు గారిల్లు (1988)
సంగీతం : చక్రవర్తి
గానం : జానకి, రమోలా
లిరిక్స్ : వేటూరి

లాలా లాలా లాలా లాలాల లాలా లాలా లలలల్లాలల స రి గ
లాలాలాల లాలాల స రి గ ... స రి గ
స రి గ మ ప ద ని
స సరాగాలాడాలి రి రిథమ్ కలిపి
గా గలాటా చేయాలి మ మనం కలిసి
ప పసి వయసులో ద దడుపు విడిచి
ని నిదుర మరిచి మనమంతా ఆట పాటల్లోన... స సరాగాలాడాలి

క కలత మరిచి కనులు తుడిచి కథలుమరిగి చలాకీగా
నిన్న మరువని రేపు తలవని మేటి మనుగడ సాగించి
ఏడేడు రంగుల ఆ ఇంద్ర ధనసులా
ఏనాడు తరగని మా మంచి మనసుతో
ద జతలు కలిసి ఖుషి చేద్దాం.... స సరాగాలాడాలి

స సనిస మ పగరిస రి రిసరి దపమ గ రి
గ గరిగ సరిగమపదని స

ప పదము కలిపి మనము కలిసి జగము మరిచి కులాసాగా
లేత మంజుల పూత వయసుల తేనె తలపులు సాగాలి
దూరాన గగనమే మనహద్దు కాగా
ఆ సూర్య చంద్రులే నేస్తాలు కావుగా
చ చదువు మరచి మజా చేద్దాం ... స సరాగాలాడాలి