నీవే రాగం నేనే గీతం

నీవే రాగం నేనే గీతం
చిత్రం: విక్రమ్ (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: బాలు, సుశీల

నీవే రాగం నేనే గీతం
శృతి చేసింది అనురాగమే
ఎవరేమన్నా ఎదురేదైనా
నాలో రాగాలన్ని నీకే అంకితం
నాలో రాగాలన్ని నీకే అంకితం

నీవే రాగం నేనే గీతం
శృతి చేసింది అనురాగమే
ఎవరేమన్నా ఎదురేదైనా
నాలో రాగాలన్ని నీకే అంకితం
నాలో రాగాలన్ని నీకే అంకితం

కాలాలకు అది కరగదులే
దైవాలకే అది బెదరదులే
నడి వేసవికి వసివాడదులే
సుడి గాలులకి ఇల రాలదులే
ఖరీదిచ్చె షరాబేడి?
గరీబైనా వరిస్తుందీ
అదే ప్రేమా
అదే అనురాగం అనుబంధం

నీవే రాగం నేనే గీతం
శృతి చేసింది అనురాగమే
ఎవరేమన్నా ఎదురేదైనా
నాలో రాగాలన్ని నీకే అంకితం
నాలో రాగాలన్ని నీకే అంకితం

ఒక జ్వాలగా అధి రగులునులే
ప్రియజ్యోతిగా అది మిగిలెనులే
అది ఎరుగనిది భయమొకటేలే
మనసెరుగనిదీ బ్రతుకెందుకులే

అదే సత్యం అదే నిత్యం
అదే ప్రాణం అదే సర్వం
అదే ప్రేమా
అదే అనురాగం అనుబంధం

నీవే రాగం నేనే గీతం
శృతి చేసింది అనురాగమే
ఎవరేమన్నా ఎదురేదైనా
నాలో రాగాలన్ని నీకే అంకితం
నాలో రాగాలన్ని నీకే అంకితం