December 23, 2019

ఒట్టేసి చెబుతున్నా


ఒట్టేసి చెబుతున్నా
ఒట్టేసి చెబుతున్నా (2003)
సంగీతం:విద్యాసాగర్
గానం:గోపాల్, శ్రీనిధి
రచన:చంద్రబోస్

ఒట్టేసి చెబుతున్నా వింటున్నావా ఓ మైనా నువ్వంటే నేనేననీ
అడుగేసి వస్తున్నా ఎందాకైనా యేవైఁనా నీ వెంటే వుండాలని
తీరిందమ్మా ఆరాటం దొరికిందమ్మా ఆధారం
నీవల్లే మారిందే నా జాతకం
అందిందమ్మో అనుబంధం ఏవో జన్మల ఋణబంధం
నీ ఒళ్ళో వాలిందే నా జీవితం

వెళ్ళేటి దారుల్లోన నీడుంటే చాలనుకుంటే బంగరు మేడై కలిసొచ్చావే
వేచేటి కన్నుల్లోన కలలుంటే చాలనుకుంటే కమ్మని నిజమై కనిపించావే
దీవెన చాలని అనుకుంటే దైవం అందెనే
పూజకు రమ్మని పిలుపిస్తే ప్రాణం పంచెనే
నా రాతే మార్చేసే నా గీతే దిద్దేసే భామిని ఉండగ బ్రహ్మెందుకో

నీ లేతపాదాలంటే ధూళైతే చాలనుకుంటే పాపిట తిలకమే చేశావమ్మా
నీ పెరటితోటల్లోన గాలైతే చాలనుకుంటే ఊపిరిలో నను నిలిపావమ్మా
నాలో నేడే వెలిగిందే ఆశాదీపము
ప్రేమే మనకు అందించే ఆశీర్వాదము
నీ మెళ్ళో ముళ్ళేసి మల్లెల్లో యిల్లేసి జతపడి బ్రతకని జన్మెందుకో

ఒట్టేసి చెబుతున్నా వింటున్నావా ఓ మైనా నువ్వంటే నేనేననీ
అడుగేసి వస్తున్నా ఎందాకైనా యేవైఁనా నీ వెంటే వుండాలని
తీరిందమ్మా ఆరాటం దొరికిందమ్మా ఆధారం
నీవల్లే మారిందే నా జాతకం
అందిందమ్మో అనుబంధం ఏవో జన్మల ఋణబంధం
నీ ఒళ్ళో వాలిందే నా జీవితం