సుందరి నేనే నువ్వంటా

సుందరి నేనే నువ్వంట
చిత్రం: దళపతి (1991)
సంగీతం: ఇళయరాజా
గీత రచయిత: రాజశ్రీ
నేపథ్యగానం: బాలు, చిత్ర

పల్లవి:

సుందరి నేనే నువ్వంట
చూడనీ నీలో నన్నంట

కానుకే ఇచ్చా మనసంటా
జన్మకై తోడై నేనుంటా

గుండెలో నిండమంటా
నీడగా పాడమంటా
నా సిరి నీవేనటా

||సుందరి||

చరణం 1:

అనుకున్న మాటలు సర్వం 
కరిగి పోతే న్యాయమా
మధురాల మధువులు చింది 
చల్లనిప్రేమే మాయమా

రేపవలు ఇద్దరలోనూ 
ఎద నీ తోడే కోరునూ
యుధ్ధాన ఏమైనా 
నా ఆత్మే నిన్నే చేరును

ఎద తెలుపు ఈ వేళా 
ఏల ఈ శోధనా

జాబిలిని నీవడుగూ 
తెలుపు నా వేదనా

నాలో ప్రేమే మరిచావు

ప్రేమే నన్నే గెలిచేనే

కానుకే ఇచ్చా మనసంటా
జన్మకై తోడే నేనుంటా

||సుందరి||

చరణం 2:

పూవులే ముళ్ళై తోచు 
నీవే నన్ను వీడితే
ఊహలే పూలై పూచు 
నీ ఎద మాటున చేరితే

ఆ..
మాసాలు వారాలౌను 
నీవూ నేనూ కూడితే
వారాలు మాసాలౌను 
బాటే మారి సాగితే

పొంగునే బంధాలే 
నీ దరీ చేరితే

గాయాలు ఆరేనూ 
నీ ఎదుట ఉంటే

నీవే కదా నా ప్రాణం

నీవే కదా నా లోకం

||సుందరి||