December 29, 2019

ఎవరికి ఎవరు చివరికి ఎవరు?

ఎవరికి ఎవరు
దేవదాసు మళ్ళీ పుట్టాడు (1978)
ఎస్.రాజేశ్వరరావు
సినారె
రామకృష్ణ, శ్రీమతి రమణ

ఎవరికి ఎవరు చివరికి ఎవరు?
ముగియని ఈ యాత్రలోనా
ముగిసే ఈ జన్మలోనా?

చరణం 1:

పూలను పెంచే తోటమాలీ
నీవే తోటకు నిప్పులు పెడితే
వెన్నెల కురిసే పున్నమి జాబిలీ
చీకటితో నీవు చేయి కలిపితే
వెన్నెల లేదు-వేకువ లేదు
వెన్నెల లేదు-వేకువ లేదు
ఉదయం లేదు-హృదయం లేదు
బ్రతుకే చేదు

చరణం 2:

దేవుడు వెలసిన కోవెల తానే
వల్లకాడుగా మారిపోతే
గుండెలమాటున నిండుగ వెలిగే
ప్రణయదీపమే ఆరిపోతే
దేవుడు లేడు - జీవుడు లేడు
దేవుడు లేడు - జీవుడు లేడు
వేడుకలేదు-వేదన లేదు
వలపే చేదు