తారలెంతగా మెరిసేను


తారలెంతగా
అక్బర్-సలీం-అనార్కలి (1978)
సంగీతం: C.రామచంద్ర
రచన: సినారె
గానం: మహమ్మద్ రఫీ

పల్లవి:

తారలెంతగా మెరిసేనో..
తారలెంతగా మెరిసేనో
చందురుని కోసం 
చందురుని కోసం
రేయి ఎంతగా మురిసేనో..
రేయి ఎంతగా మురిసేనో
దినకరుని కోసం 
దినకరుని కోసం
తారలెంతగా మెరిసేనో
చరణం 1:

చిగురుటాకులే చేతులుగా..
మిసిమిరేకులే పెదవులుగా
చిగురుటాకులే చేతులుగా..
మిసిమిరేకులే పెదవులుగా
పరిమళాలే పిలుపులుగా..
మకరందాలే వలపులుగా
పూవులెంతగా వేచేనో..
పూవులెంతగా వేచేనో
తుమ్మెదల కోసం..
తుమ్మెదల కోసం
తారలెంతగా మెరిసేనో

చరణం 2:

నింగి రంగులే కన్నుల దాచి 
కడలి పొంగులే ఎదలో దాచి
నింగి రంగులే కన్నుల దాచి 
కడలి పొంగులే ఎదలో దాచి
గులాబి కళలే బుగ్గల దాచి 
మెరుపుల అలలే మేనిలో దాచి
పరువాలెంతగ వేచేనో..
పరువాలెంతగ వేచేనో
పయ్యెదల కోసం..పయ్యెదల కోసం
తారలెంతగా మెరిసేనో..
చందురుని కోసం

No comments:

Post a Comment

Leave your comments