December 30, 2019

నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా


నేస్తమా...
చిత్రం: పెళ్ళి పందిరి (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గురుచరణ్
గానం: బాలు, గోపికా పూర్ణిమ

మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం
నింగీ నేలా నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు
ఉహుఁ ఈ అందాలన్నీ చూడలేని నాకళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా

నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా 
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా 
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

ఈ గుండెలోన నీ ఊపిరుంటే... 
ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే....
ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే...
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే....
నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా 
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

మరి లోకంలో ఎన్ని రంగులున్నాయ్ ?
అవి ఎలా ఉంటాయ్?

బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినపుడు 
దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది

పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు 
తెల్లరంగు అట్టా ఉంటుంది

నీలో నిలువున పులకలు రేగిన వేళ 
నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా

దిగులు రంగే హా హా 

నలుపు అనుకో హా హా

ప్రేమ పొంగే హా హా 

పసుపు అనుకో హా

భావాలను గమనిస్తుంటే
ప్రతి రంగును చూస్తున్నట్టే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే

నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా 
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

ఉదయం, సాయంత్రం అంటారే.... 
అవి ఎలా ఉంటాయ్...?

మొదటిసారి నీ గుండెలలో 
తీయనైన ఆశలురేపే 
ఆ కదలిక ఉదయం అనుకోమ్మా

చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే 
సాయంత్రం అయినట్టేనమ్మా

నీలో నవ్విన ఆశలు నా చెలివైతే 
నేనై పలికిన పలుకులు నీ కులుకైతే

ఇలవు నీవే హా హా రవిని నేనే హా హా

కలువ నీవే హా హా శశిని నేనే హా

ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే

నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా 
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే
ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే