December 23, 2019

ఓ చెలియా

ఓ చెలియా
ప్రేమికుడు (1994)
రాజశ్రీ
రెహమాన్
ఉన్ని కృష్ణన్

ఓ చెలియా ..నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే..
ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే...
నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే...ఏ..

ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే..ఏ..
నా గుండెలలో ప్రేమ పరవశమై.. ఇరు కన్నులు సోలెనులే..ఏ..
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే...

ఈ పూటా చెలి నా మాటా  ఇక కరువై పోయెనులే
అధరము ఉదరము నడుమను ఏదో అలజడి రేగెనులే...
వీక్షణలో నిరీక్షణలో అర క్షణ మొక యుగమేలే
చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా..నరకమా...ఏమిటొ తెలియదులే
ఈ జీవికీ జీవన్మరణమూ నీ చేతిలొ ఉన్నదిలే..ఏ..ఏ...
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే

కోకిలమ్మా నువు సై అంటే నే పాడేను సరిగమలే
గోపురమా నిను చేరుకుని సవరించేను నీ కురులే..ఏ..
వెన్నెలమ్మా నీకు జోల పాడి కాలి మెటికలు విరిచేనే..ఏ..
వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే...ఏ..
నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే
నీ అడుగులా చెరగని గురుతులే ప్రేమ చరితను అంటానే