ఎవ్వడికెవడు బానిసా…
K.G.F. చాప్టర్-1 (2018)
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి.
సంగీతం: రవి బస్రూర్
గానం: అనన్య భట్
ఎవ్వడికెవడు బానిసా…
ఎవడికి వాడే బాద్ షా …
ఒత్తిచూసే తొత్తుకొడుకుల
నెత్తెక్కి ఆడే ధింసా….
ఉరిగా బిగిసే తాడే
ఊగే ఉయ్యాలా…
కరిగే మనసే మరిగిపోనీ లావాలా…
ఆయుధమే ఆగ్రహాల జ్వాలా….
రగిలే చూపులు మౌన శంఖారావంలా…
ఎగసే ఊపిరి యుద్ధభేరీ నాదంలా …
నిర్జించరా….
దౌర్జన్యాన్నీ వేళా…
ఆర్యుడా… సూర్యుడా…
కదలరా….
ధైర్యమే సైన్యమై
ఎదగరా….
నా అణువణువు నీవుగా…
ప్రతి క్షణము నీదిగా….
వేచా కాలమే సాక్షిగా….
నీ ప్రతి పదమున
జాడగా జయగీతము పాడగా…
లేనా వీడని తోడుగా…
ఒదిగిమదిగి ఉన్నా
ఓర్పే నిప్పల్లె
అణిచే అన్యాయాన్ని
అంతం చెయ్యాలే…
కత్తి దూసే…
సైనికుడై రారా….
బెదురు భయము లేని
ధైర్యం నువ్వేలే …
బడుగు జీవుల ఆశ
దీపం నువ్వేలే…
కన్నీళ్ళు తుడిచే
నాయకుడై రారా…
ఆర్యుడా… సూర్యుడా…
కదలరా….
ధైర్యమే సైన్యమై
ఎదగరా….