December 22, 2019

సింగరాయకొండ

సింగరాయకొండ
చిత్రం: సుప్రభాతం (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: బాలు, స్వర్ణలత

సింగరాయకొండ ఈ చిన్నోడిది
ఆకుపచ్చ జండా ఈ అందానిది
నీ చూపులోనే చిత్తూరు ఉంది
నీ కొంగు లోనే ఒంగోలు ఉంది
ప్యాకేజిలోన ఉన్న మనసు నీకయ్యింది
మ్యారేజి దాక ఆగనంటు దూకేస్తుంది

సింగరాయకొండ ఈ చిన్నోడిది
ఆకుపచ్చ జండా ఈ అందానిది

బందరు నుంచి బాజాలొచ్చి
మోగించాలి పెళ్లిపాటలు
అత్తిలి నుంచి అతిధులు వచ్చి
అందించాలి శుభాకాంక్షలు
గుంతకల్లు పొలిమేర దాకా బంతిపూలు చల్లాలంటా
తాడేపల్లి నడిబొడ్డుదాకా తోరణాలు కట్టాలంటా
అహ లక్షల కొద్ది అక్షింతలు పడగా
ఒహొ లెక్కకు మించి కానుకలేరాగ
ఎంతో ఇదిగా పెళ్లి జరగాలి
ఏమి ముహూర్తం తెల్లబోవాలి

సింగరాయకొండ ఈ చిన్నోడిది
ఆకుపచ్చ జండా ఈ అందానిది

అరకువేలిలో చెరకుపొదల్లో పరిచెయ్యాలి పట్టెమంచము
పాపి కొండల్లో పండు వెన్నెల్లో జరిపించాలి జంట యుద్ధము
జన్మభూమి శ్రమదానమల్లే శోభనాలు సాగాలంట
కొరకురాయి కంప్యూటరల్లే కాపురాలే చెయ్యాలంటా
అహ వారంలోగ వేసెయ్యి పాగా
ఒహో సూపర్ ఫాస్ట్ సీమంతం కాగా
రెండను మాటే మూడు కావాలి
మళ్ళి మళ్ళి మూడు రావాలి

సింగరాయకొండ ఈ చిన్నోడిది
ఆకుపచ్చ జండా ఈ అందానిది
నీ చూపులోనే చిత్తూరు ఉంది
నీ కొంగు లోనే ఒంగోలు ఉంది
ప్యాకేజిలోన ఉన్న మనసు నీకయ్యింది
మ్యారేజి దాక ఆగనంటు దూకేస్తుంది

సింగరాయకొండ ఈ చిన్నోడిది
ఆకుపచ్చ జండా ఈ అందానిది