నీకైనా నాకైనా
చిత్రం: కలలు కనే కళ్ళు (1984)
సంగీతం: శ్యామ్
రచన:మైలవరపు గోపి
గానం:కె.జే. ఏసుదాస్
నీకైనా నాకైనా
నీకైనా నాకైనా
మనసొకటే
మన కలలొకటే
మనసొకటే
మన కలలొకటే
మారేవి తలరాతలే
జ్యోతీ....
నీకైనా.... నాకైనా....
చరణం 1:
నీకు చూపే చీకటి
నాకు అంతా చీకటీ
నీది ఒకటే వేదనా
నాకు రోజూ రోదనా
ఈ వెలుగూ నీడలలో
ఆ నువ్వూ బొమ్మవే...
ఈ నేనూ బొమ్మనే...
మారేవి తలరాతలే
మారేవి తలరాతలే
జ్యోతీ....
నీకైనా.... నాకైనా
చరణం 2:
చూపు లేని ఒకరికీ
చూడలేని ఒకరికీ
కలలు ఎన్నో కళ్ళలో
కలతలెన్నో బ్రతుకులో
ఈ సాగే పయనంలో
నీ గమ్యం... నా దరీ...
నా గమ్యం ఏ దరీ...
మారేవి తలరాతలే
మారేవి తలరాతలే
జ్యోతీ.....
నీకైనా... నాకైనా