December 22, 2019

మధుమాసపు మన్మధరాగమా



మధుమాసపు
శివరంజని రాగం
ఆయనకిద్దరు (1995)
కోటి
భువనచంద్ర
బాలు, చిత్ర

మధుమాసపు మన్మధరాగమా
మది పాడిన మంజులగీతమా
నిన్నే చూడనీ మౌనమా
ఒడే చేరనీ ప్రాణమా
మధుమాసపు మన్మధరాగమా
మది పాడిన మంజులగీతమా

ఏకాంతవేళా ఎదవీణ నేనై
రవళించనా
పులకించనా
నా ఊహ నీవై
నీ ఊహ నేనై
పెనవేయనా
పవళించినా

జత చేరాలి చేరాలి శ్వాస
తీరాలి తీరాలి ఆశ
పరువపు సరిగమలో
మధుమాసపు మన్మధరాగమా
మది పాడిన మంజులగీతమా

చిరుగాలితోనే కబురంపుతున్నా
నీ కౌగిలై కరగాలనీ
విరహాలతోనే మొరపెట్టుకున్నా
ఎదలోయలో ఒదగాలనీ

వయసూగింది ఊగింది తుళ్ళి
కౌగిళ్ళే కోరింది మళ్ళి
తనువుల తొలకరిలో

మధుమాసపు మన్మధరాగమా
మది పాడిన మంజులగీతమా
నిన్నే చూడనీ మౌనమా
ఒడే చేరనీ ప్రాణమా