కురిసింది వాన
చిత్రం: సంకల్పం (1995)
రచన: వడ్డేపల్లి కృష్ణ
గానం: బాలు, బాలు కూతురు పల్లవి
సంగీతం: కోటి
కురిసింది వాన వాన జల్లు కోరగా,
విరిసింది ప్రేమ ప్రేమ తియ్యతియ్యగా..
స్వాతిచినుకులే రాలగా...ఓ
పూలజల్లుగా మారగా
అంబరమున కరిమబ్బులు
సంబరముగ పయనించగ
మది నెమలిగ ఆడిందిలే
కురిసింది వాన వాన జల్లు కోరగా,
విరిసింది ప్రేమ ప్రేమ తియ్యతియ్యగా..
చరణం 1:
ఇన్నాళ్ళ వలపంతా
చిన్నారి తలపంతా
పూచెను మలుపుల పిలుపులతో
నీలోని పులకింత
నాలోని గిలిగింత
చిక్కెను జిగిబిగి కౌగిలిలో
చినుకమ్మ చిటుకే
చిత్రంగా చిలికే
మారాకు తొడిగే
మనప్రేమ కడకే
కోరిక మది చెలరేగగ
కోరిన చెలి దరిజేరగ
జరుగును మన కళ్యాణమే
చరణం 2:
సిరిమల్లె సొగసల్లే
జాబిల్లి మనసల్లే
చేరెను ప్రియ సుకుమారముతో
గోదారి వరదల్లే
ప్రాయాల పరవళ్ళు
దూకెను ఎద శృంగారంతో
వయసంతా వరదా
వలపంతా సరదా
ముద్దియ్య వలదా
తొలగింది పరదా
తీయని కల నిజమైనది
మాయని కథ మనదైనది
జతకోరిన రాగాలతో
కురిసింది వాన వాన జల్లు కోరగా,
విరిసింది ప్రేమ ప్రేమ తియ్యతియ్యగా..
స్వాతిచినుకులే రాలగా...ఓ
పూలజల్లుగా మారగా
అంబరమున కరిమబ్బులు
సంబరముగ పయనించగ
మది నెమలిగ ఆడిందిలే
కురిసింది వాన వాన జల్లు కోరగా,
విరిసింది ప్రేమ ప్రేమ తియ్యతియ్యగా..