చిన్నారి మనసుకు
చిత్రం: సంకల్పం (1995)
రచన: సిరివెన్నెల
గానం: బాలు, చిత్ర
సంగీతం: కోటి
చిన్నారి మనసుకు ఇంతలోనె మరి అంత తొందరా...
సింగారి సొగసుకు చెంగు చెంగుమని అన్ని చిందులా...
హుషారుగా ఈడే ఈల వేయగా
మదనుడి మతే చెడే లయ
జతపడి శృతే చెయ్యాలయ్యా
పెదవుల దాహం తీరే దాకా
చిన్నారి మనసుకు ఇంతలోనె మరి అంత తొందరా...
సింగారి సొగసుకు చెంగు చెంగుమని అన్ని చిందులా...
చరణం 1:
కాలమే రాని కోనలో
లోకమే లేని సీమలో
కౌగిలే కానుకీయన
ఆకలే తీరగా
సూర్యుడే చూడలేని నీ
సోకులే స్వాగతించగ
సూటిగా చెంతచేరనా
సిగ్గులే జారగా
వయ్యారమే తయారుగా ఉన్నాదయ్యా
ఒళ్ళోకొచ్చి వడ్డించవే ఎంచక్కగా
లేనడుమును నిముషము వదలక
తడబడు చెలి పరువము నేలవయా
మదనుడి మతే చెడే లయ
జతపడి శృతే చెయ్యాలయ్యా
పెదవుల దాహం తీరే దాకా
చిన్నారి మనసుకు ఇంతలోనె మరి అంత తొందరా...
సింగారి సొగసుకు చెంగు చెంగుమని అన్ని చిందులా...
చరణం 2:
చంద్రుడే అందు అంచున
మబ్బులో మంచమేయనా
మంచులో మంటరేగగా ముద్దులే పంచనా
హంసలా ఆడుతున్న నా
అందమే హారతీయన
వెచ్చని ఒంపుసొంపుల హారమే వేయనా
తథాస్తనీ తరించనీ తారామణీ
సరేననీ వరించనీ పాపాలన్నీ
రేపవలని సమయము నెరుగక
తహతహమను తమకము తీర్చుమరీ