December 23, 2019

ముద్దుల జానకి


ముద్దుల జానకి
చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం : రాజ్-కోటి
రచన : వడ్డేపల్లి కృష్ణ
గానం :  చిత్ర

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకు పోవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకు పోవలెనే
మురిపాల తేలించ మునిమాపులో
దివినుండి రేరాజు దిగివచ్చులే
ఆ ఆ ఆ ఆ ఆ

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశలరెక్కల హంసలు పల్లకి మోసుకు పోవలెనే
తొలకరిలా వలపంతా కురిసెనులే
తీయని ఊహలు చిగురు తొడిగెను

చరణం 1:

నింగిని తాకే పందిరివేసి
పచ్చని పల్లెను పీటగ జేసి
నింగిని తాకే పందిరివేసి
పచ్చని పల్లెను పీటగా జేసి
బంగారు రంగులు వేయించరారె
మురిపాల పెళ్ళి జరిపించరారే
వధువు సొగసంత మెరిసే
వలపు మదిలోన విరిసే
చిలిపి కోరికలు కురిసే
పడుచు పరువాలు బిగిసే
కనివిని ఎరుగని కమ్మనిభావన కధలుగ కనిపించే
ఆ ఆ ఆ ఆ ఆ

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకు పోవలెనే

చరణం 2:

తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
రాయంచలన్నీ రాగాలు తీసే
చిలకమ్మలెన్నో చిత్రాలు చేసే
కదలిరావమ్మ నేడే
కలలు పండేటి వేళ
వేచియున్నాడు వరుడే సంజె సరసాల కేలా
సరసపు వయసున ఒంపుల సొంపుల సరిగమ వినిపించే
ఆ ఆ ఆ ఆ ఆ

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకు పోవలెనే
మురిపాల తేలించ మునిమాపులో
దివినుండి రేరాజు దిగివచ్చులే
ఆ ఆ ఆ ఆ ఆ