అంతరంగాలు
అంతరంగాలు (2005)
రచన: చెరుకూరి సుమన్
సంగీతం: సాలూరి వాసూరావు
గానం: బాలు
అంతరంగాలు
అనంత మానస చదరంగాలు
ఆఅ
అంతే ఎరగని ఆలోచనల సాగరాలు
అంతరంగాలు
అనంత మానస చదరంగాలు
ఆఅ
అంతే ఎరగని ఆలోచనల సాగరాలు
ఇవి మది నదిలో నలిగే భావ తరంగాలు
బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు
ఇవి మది నదిలో నలిగే భావ తరంగాలు
బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు
అంతరంగాలు అనంత మానస
చదరంగాలు ఆఅ
అంతే ఎరగని ఆలోచనల సాగరాలు
ఆలిని అమ్మి అలమటించేది ఒకరు
తాళిని నమ్మి తల్లడిల్లేది ఒకరు
ఆలిని అమ్మి అలమటించేది ఒకరు
తాళిని నమ్మి తల్లడిల్లేది ఒకరు
అభిమానం కోసం
ఆరాటపడే దొకరు
అనుమానం కమ్మి
ఆవేదనపాలైన దొకరు
తెలిసీ తప్పులు చేసినదెవరు?
విధి ఆటలో పావులే అందరూ
విధి ఆటలో పావులే అందరూ
అంతరంగాలు
అనంత మానస చదరంగాలు
ఆఅ
అంతే ఎరగని ఆలోచనల సాగరాలు
సుడిగుండంలో చిక్కుకున్నాక సుఖమెక్కడిదీ?
నడిసంద్రంలోని నావకు నడిచే దారెక్కడిదీ?
సుడిగుండంలో చిక్కుకున్నాక సుఖమెక్కడిదీ?
నడిసంద్రంలోని నావకు నడిచే దారెక్కడిదీ?
అంతరంగాల్లోని అగ్గికి అంతమనేది ఎక్కడిది?
జీవన్మృతులుగ మారడం తప్ప వేరే దారేదీ?
తెలిసీ తప్పులు చేసినదెవరు?
విధి ఆటలో పావులే అందరూ
విధి ఆటలో పావులే అందరూ
అంతరంగాలు
అనంత మానస చదరంగాలు
ఆఅ
అంతే ఎరగని ఆలోచనల సాగరాలు
ఇవి మది నదిలో నలిగే భావ తరంగాలు
బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు
బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు