Showing posts with label అంతరంగాలు (2005). Show all posts
Showing posts with label అంతరంగాలు (2005). Show all posts

గుండెకి సవ్వడెందుకో


గుండెకి సవ్వడెందుకో
రచన: సుమన్
సంగీతం: సాలూరి వాసూరావు
అంతరంగాలు (2005)

గుండెకి సవ్వడెందుకో
పెదవులకి వణుకెందుకో

గుండెకి సవ్వడెందుకో
పెదవులకి వణుకెందుకో
పరువానికి పరుగెందుకో
తనువుకి తపనెందుకో
గుండెకి సవ్వడెందుకో
పెదవులకి వణుకెందుకో
పరువానికి పరుగెందుకో
తనువుకి తపనెందుకో

ఏమిటి కొత్త వింత ..
మదిలో ఏదో పులకింత ..
అర్థం కానీ కవ్వింత .
ఆశల గిలిగింత ..
ఇదేనేమో ప్రేమా..
నవ యవ్వన సీమ ..
ఇదే సుమా ప్రేమా ..
ఆ మదనుడి మహిమ .

గుండెకి సవ్వడెందుకో
పెదవులకి వణుకెందుకో
పరువానికి పరుగెందుకో
తనువుకి తపనెందుకో


ఇది తొలి తొలి వలపుల తొలకరి ధ్వని ..
తొలకరి ధ్వని తపనకు తరగని గని
తలపుల రాజధాని
ఇది తొలి తొలి వలపుల తొలకరి ధ్వని ..
తొలకరి ధ్వని తపనకు తరగని గని
తలపుల రాజధాని
అడగకు ఇది ఏమని అంతరంగానికిదే ఆమని
అనంత జీవన వాహిని ..
అద్భుతాలందామని
ఇది కమ్మని యామిని జన సమ్మోహినీ ..
జగతికీ వరదాయిని ..
ఇదే ఇదే ప్రేమా..
నవ యవ్వన సీమ ..
ఇదే సుమా ప్రేమా ..
ఆ మదనుడి మహిమ

గుండెకి సవ్వడెందుకో
పెదవులకి వణుకెందుకో
పరువానికి పరుగెందుకో
తనువుకి తపనెందుకో

ఇది వయస్సు చేసే తలపుల తపస్సు ..
ఎద ఎదని పండించే ఎర్రని తేజస్సు .
ఇది వయస్సు చేసే తలపుల తపస్సు ..
ఎద ఎదని పండించే ఎర్రని తేజస్సు ....
ఇది మదిలో వెల్లివిరిసే ఇంద్ర ధనుస్సు
మనసుకీ పరమార్థమిచ్చే మధుర ఉషస్సు
ఇది యవ్వన యశస్సు ..ఆశల ఆశీస్సు
దీనికో నమస్సు ..
ఇదే ఇదే ప్రేమా..
నవ యవ్వన సీమా ..
ఇదే సుమా ప్రేమా ..
ఆ మదనుడి మహిమ

గుండెకి సవ్వడెందుకో
పెదవులకి వణుకెందుకో
పరువానికి పరుగెందుకో
తనువుకి తపనెందుకో
గుండెకి సవ్వడెందుకో
పెదవులకి వణుకెందుకో
పరువానికి పరుగెందుకో
తనువుకి తపనెందుకో

ఇదే ఇదే ప్రేమా..
నవ యవ్వన సీమా ..
ఇదే సుమా ప్రేమా ..
ఆ మదనుడి మహిమ

ల....లాలాల ల... లాలాలాఆ
ల....లాలాల ల... లాలాలాఆ
ల....లాలాల ల... లాలాలాఆ

ఎంత గొప్పది బతుకుమీద ఆశ ఆ...


ఎంత గొప్పది
అంతరంగాలు (2005)
రచన: చెరుకూరి సుమన్
సంగీతం: సాలూరి వాసూరావు
గానం: బాలు

ఎంత గొప్పది
బతుకుమీద ఆశ ఆ...
ఎంత గొప్పది
బతుకుమీద ఆశ
ఇది భూమిపైన దేవుడి శ్వాసా...
ఇది భూమిపైన దేవుడి శ్వాస
మాయమవనిది మాసిపోనిది
మాయమవనిది మాసిపోనిది
లోకమెంత మలినమైనా
మలిగిపోదిది
లోకమెంత మలినమైనా
మలిగిపోదిది
ఎంత గొప్పది
బతుకుమీద ఆశ
ఇది భూమిపైన దేవుడి శ్వాసా...
ఇది భూమిపైన దేవుడి శ్వాస

గొంతు తుంచివేసినా
గులాబీ వికసించదా
పంజరంలోని చిలుకైనా
పలుకు ఆపివేస్తుందా?
గొంతు తుంచివేసినా
గులాబీ వికసించదా
పంజరంలోని చిలుకైనా
పలుకు ఆపివేస్తుందా?
బోయవాడి కోసమని లేడి
బోసినవ్వు మానుతుందా
బోయవాడి కోసమని లేడి
బోసినవ్వు మానుతుందా
చావులెన్నో తాను చూసినా
ఆశ చనిపోతుందా
చావులెన్నో తాను చూసినా
ఆశ చనిపోతుందా
ఎంత గొప్పది
బతుకుమీద ఆశ
ఇది భూమిపైన దేవుడి శ్వాస
ఇది భూమిపైన దేవుడి శ్వాస

మనిషి బతుకే ఓ కష్టాల కడలి
మనిషి బతుకే ఓ కష్టాల కడలి
జీవనయానంలో నైరాశ్యమో మజిలీ
జీవనయానంలో నైరాశ్యమో మజిలీ
ఎంత పగిలిన మనసైనా
పలుకకపోదూ
చివరకు చిగురుటాశల రవళి
ఎంత పగిలిన మనసైనా
పలుకకపోదూ
చివరకు చిగురుటాశల రవళి
ఎంత గొప్పది
బతుకుమీద ఆశ
ఇది భూమిపైన దేవుడి శ్వాస
భూమిపైన దేవుడి శ్వాస

నడిసంద్రంలోని నావను
నడిపించేదే ఆశా
ఉప్పెన ముంచెత్తినా
ఉదయాన్ని చూస్తే ఆశ
నడిసంద్రంలోని నావను
నడిపించేదే ఆశా
ఉప్పెన ముంచెత్తినా
ఉదయాన్ని చూస్తే ఆశ
చీకటిలో చిక్కినవారికి
చిరుదీపమే ఆశ
చీకటిలో చిక్కినవారికి
చిరుదీపమే ఆశ
విషాదాల నిషాదంలో
వివేకమేలే ఆశ
విషాదాల నిషాదంలో
వివేకమేలే ఆశ

ఎంత గొప్పది
బతుకుమీద ఆశ
ఎంత గొప్పది
బతుకుమీద ఆశ
ఇది భూమిపైన దేవుడి శ్వాస
ఇది భూమిపైన దేవుడి శ్వాస
మాయమవనిది మాసిపోనిది
మాయమవనిది మాసిపోనిది
లోకమెంత మలినమైనా
మలిగిపోదిది
లోకమెంత మలినమైనా
మలిగిపోదిది
ఎంత గొప్పది
బతుకుమీద ఆశ
ఇది భూమిపైన దేవుడి శ్వాస
ఇది భూమిపైన దేవుడి శ్వాస

అంతరంగాలు...అనంత మానస చదరంగాలు



అంతరంగాలు
అంతరంగాలు (2005)
రచన: చెరుకూరి సుమన్
సంగీతం: సాలూరి వాసూరావు
గానం: బాలు

అంతరంగాలు
అనంత మానస చదరంగాలు
ఆఅ
అంతే ఎరగని ఆలోచనల సాగరాలు
అంతరంగాలు
అనంత మానస చదరంగాలు
ఆఅ
అంతే ఎరగని ఆలోచనల సాగరాలు

ఇవి మది నదిలో నలిగే భావ తరంగాలు
బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు
ఇవి మది నదిలో నలిగే భావ తరంగాలు
బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు
అంతరంగాలు అనంత మానస
చదరంగాలు ఆఅ
అంతే ఎరగని ఆలోచనల సాగరాలు

ఆలిని అమ్మి అలమటించేది ఒకరు
తాళిని నమ్మి తల్లడిల్లేది ఒకరు
ఆలిని అమ్మి అలమటించేది ఒకరు
తాళిని నమ్మి తల్లడిల్లేది ఒకరు
అభిమానం కోసం
ఆరాటపడే దొకరు
అనుమానం కమ్మి
ఆవేదనపాలైన దొకరు
తెలిసీ తప్పులు చేసినదెవరు?
విధి ఆటలో పావులే అందరూ
విధి ఆటలో పావులే అందరూ
అంతరంగాలు
అనంత మానస చదరంగాలు
ఆఅ
అంతే ఎరగని ఆలోచనల సాగరాలు

సుడిగుండంలో చిక్కుకున్నాక సుఖమెక్కడిదీ?
నడిసంద్రంలోని నావకు నడిచే దారెక్కడిదీ?
సుడిగుండంలో చిక్కుకున్నాక సుఖమెక్కడిదీ?
నడిసంద్రంలోని నావకు నడిచే దారెక్కడిదీ?
అంతరంగాల్లోని అగ్గికి అంతమనేది ఎక్కడిది?
జీవన్మృతులుగ మారడం తప్ప వేరే దారేదీ?
తెలిసీ తప్పులు చేసినదెవరు?
విధి ఆటలో పావులే అందరూ
విధి ఆటలో పావులే అందరూ
అంతరంగాలు
అనంత మానస చదరంగాలు
ఆఅ
అంతే ఎరగని ఆలోచనల సాగరాలు

ఇవి మది నదిలో నలిగే భావ తరంగాలు
బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు
బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు